నాకు భారతదేశమే అన్నీ ఇచ్చింది: అక్షయ్ కుమార్

  • అక్షయ్ కుమార్ కు కెనడా పౌరసత్వం
  • తరచుగా అక్షయ్ పై విమర్శలు
  • పాస్ పోర్టు మార్చుకుంటున్నట్టు వెల్లడి
భారత్ తో పాటు కెనడా పౌరసత్వం కూడా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడం తెలిసిందే. దీనిపై అక్షయ్ కుమార్ తాజాగా స్పందించారు. 

తాను భారతీయుడ్నని, తనకు సర్వం భారతదేశమేనని స్పష్టం చేశారు. పాస్ పోర్టు మార్చుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. తాను కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నానో తెలియకుండా ప్రజలు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. 

"నాకు అన్నీ భారతదేశమే ఇచ్చింది. నేను పొందింది, నేను సంపాదించుకుంది ఇక్కడే. ఇప్పుడు మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాను" అని వివరించారు. ఆజ్ తక్ చానల్లో ప్రసారమయ్యే సీదీ భాత్ అనే కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Akshay Kumar
India
Canada
Citizenship
Bollywood

More Telugu News